
సమరానికి సైరన్
‘పరిషత్’ గణాంకాలు
‘గ్రామపంచాయతీ’లు ఇలా..
ఏ విడతలో అంటే..
వచ్చే నెల 23, 27వ తేదీల్లో పోలింగ్
మూడు విడతల్లో గ్రామపంచాయతీల ఎన్నికలు
వచ్చే నెల 31, నవంబర్ 4, 8 తేదీల్లో పోలింగ్‌కు షెడ్యూల్ విడుదల
ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం
8లో
స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. ఏడాదిన్నరగా అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇటు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై అయోమయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలుకు ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కొందరు కోర్టుకు వెళ్లడంతో.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆమేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినా.. రిజర్వేషన్లు తేలకపోవడంతో కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఎన్నికల సంఘం సైరన్ మోగించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతో పాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, ఆశావహుల నిరీక్షణకు తెరపడింది. వచ్చేనెల 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. తొలుత రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆపై మూడు విడతల్లో జీపీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలతో కోడ్ అమల్లోకి రాగా, ఎన్నికల సందడి మొదలైంది.
అంతా సిద్ధం..
ఎన్నికల ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితా ఖరారు కాగా.. బ్యాలెట్‌బాక్స్‌లు, ఇతర సామగ్రి సమకూర్చుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,580 పోలింగ్ కేంద్రాలను గుర్తించి 2,814 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. గ్రామపంచాయతీలకు 20 శాతం రిజర్వ్‌తో కలిసి 6,257 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం ఉండగా.. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. కాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పీఓలు 1,895, ఓపీఓలు 5,055 అవసరమని గుర్తించారు. జిల్లాలో క్రిటికల్ పోలింగ్‌స్టేషన్లు 18, సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలు 138, అతి సమస్యాత్మక కేంద్రాలు 200గా గుర్తించి అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు.
వచ్చేనెల 9న పరిషత్ నోటిఫికేషన్
జిల్లాలో రెండు విడతల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత అక్టోబర్ 9న, రెండో విడత 12న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మొదటి విడత అక్టోబర్ 11 వరకు, రెండో విడత 15 వరకు నామినేషన్లు స్వీకరించి, అక్టోబర్ 23, 27వ తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం కలిపి నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆ తర్వాత పంచాయతీ
జిల్లాలో మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్ని కలు ఉంటాయి. అక్టోబర్ 17, 21, 25వ తేదీల్లో విడతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఇక 19, 23, 27వ తేదీ వరకు నామినేన్లు దాఖలు చేసుకోవచ్చు. గ్రామపంచాయతీ పోలింగ్ మొదటి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత 8న నిర్వమిస్తారు. ఏ విడతలోనైనా ఎన్నిక ముగిసిన రోజే ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించాలి. ఏదైనా కారణంతో ఉపసర్పంచ్ ఎన్నిక జరగపోతే మరుసటి రోజు ఎన్నుకుంటారు.
జెడ్పీటీసీ స్థానాలు 20
ఎంపీటీసీ స్థానాలు 283
పోలింగ్‌స్టేషన్లు 1,580
ఓటర్లు 8,02,690
పురుషులు 3,88,243
మహిళలు 4,14,425
ఇతరులు 22
గ్రామపంచాయతీలు 571
వార్డులు 5,214
పోలింగ్ స్టేషన్లు 5,214
ఓటర్లు 8,02,691
పురుషులు 3,88,244
మహిళలు 4,14,425
ఇతరులు 22
ఎక్కడెక్కడ...
రెండు విడతల్లో పరిషత్ పోరు

సమరానికి సైరన్