
సరస్వతీదేవిగా అమ్మవారు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా స్వామికి అర్చకులు తెల్లవారుజామున పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత యాగశాలలో అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించి చంఢీహోమం నిర్వహించడమే కాక పలువురి చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీలో ఉద్యోగాల
భర్తీకి నోటిఫికేషన్
భద్రాచలంటౌన్: ఆర్టీసీలో వేయి మంది డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిందని, ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. www. tgprb. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 22 – 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు డ్రైవర్లుగా, 18 – 35 ఏళ్ల వయస్సు వారు శ్రామిక్ పోస్టులకు అర్హులని వెల్లడించారు. డ్రైవర్ పోస్టుకు రూ.300, శ్రామిక్ పోస్టుకు రూ.200 చెల్లించి అక్టోబర్ 8నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని పీఓ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నాలుగో రోజూ
అందని టెండర్లు
పండుగ తర్వాతే వైన్స్ దరఖాస్తులు
ఖమ్మంక్రైం: 2025–2027 సంవత్సరంనకు గాను జిల్లాలో 116 వైన్స్ షాపుల కేటాయింపునకు షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు ఈనెల 26వ తేదీ నుంచి టెండర్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అయితే, నాలుగో రోజైన సోమవారం కూడా జిల్లాని షాప్‌లకు ఒక్క దరఖాస్తూ రాలేదు. జిల్లావ్యాప్తంగా వైన్స్‌కు ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1లోనే దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ప్రకటించారు. కాగా, వ్యాపారులు పలువురు మంచి రోజు చూసుకుని డీడీలు తీస్తున్నా అక్టోబర్ 18వరకు గడువు ఉన్నందున దసరా తర్వాతే టెండర్లు దాఖలు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆలోగా ఒకటి, రెండు దరఖాస్తుల వచ్చినా పండుగ తర్వాత ఊపందుకుంటుందని భావిస్తున్నారు.

సరస్వతీదేవిగా అమ్మవారు