పక్కాగా నిబంధనల అమలు | - | Sakshi
Sakshi News home page

పక్కాగా నిబంధనల అమలు

Sep 30 2025 7:57 AM | Updated on Sep 30 2025 7:57 AM

పక్కాగా నిబంధనల అమలు

పక్కాగా నిబంధనల అమలు

● ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి ● రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని

● ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి ● రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని

ఖమ్మం సహకారనగర్‌: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున ఎక్కడ కూడా నియమావళి, నిబంధనలను విస్మరించకుండా యంత్రాంగం పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ.రాణి కుముదిని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమలు, ఇతర ఏర్పాట్లపై సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రాణి కుముదిని మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనందున ప్రవర్తన నియమావళిని అమలు చేయాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎవరు వ్యవహరించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్‌కు బ్యాలెట్‌ బాక్సులు సమకూర్చుకోగా, ఉద్యోగులకు శిక్షణపై ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ప్రత్యేక బృందాల ఏర్పాటు

స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై అధికారులతో కలెక్టర్‌ అనుదీప్‌ సమీక్షించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి అధికారులతో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. నిబంధనలు పక్కాగా అమలయ్యే అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగించడమే కాకప్రతీ మండలంలో అవసరమైన బృందాలను ఏర్పాటుచేయాలని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి వసతులపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ, స్క్రుటినీ, గుర్తుల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల శిక్షణకు ఉద్యోగులు హాజరుకాకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం వానా కాలం ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ, సీఎంఆర్‌ సేకరణ, పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆన్‌లైన్‌లో పంటల నమోదుపై సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement