
మా హయాంలోనే అభివృద్ధి
నేలకొండపల్లి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి పరుగులు తీస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మండలంలోని అమ్మగూడెం, కోనాయిగూడెం, నేలకొండపల్లిల్లో సోమవారం ఉదయం ఆయన బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. అలాగే, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, భధ్రయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, బొందయ్య, అడపాల రామారావు, నల్లాని మల్లికార్జున్‌రావు, రాయపూడి నవీన్, నంబూరి రామారావు, యర్రబోయిన నర్సయ్య, పెంటమళ్ల పుల్లమ్మ, కొచ్చేర్ల శ్రీనివాసరావు, కొమ్మినేని పుష్పావతి, మేకల వెంకటేశ్వర్లు, కొమ్మినేని విజయ్‌బాబు, కడియాల నరేష్, ఇస్లావత్ బాలాజీ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకల్లో మంత్రి
కూసుమంచి: మండలంలోని నాయకన్‌గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం రాత్రి నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో ఆడిపాడిన ఆయన మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తోందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి