
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
న్యూస్‌రీల్
పదపదమంటూ పోరుబాట పట్టిన పల్లెలు
తెలంగాణ సాయుధ పోరులో
వీరోచిత చరిత్ర
నాటి పోరాటం, అమరులకు గుర్తుగా గ్రామగ్రామాన స్తూపాలు
ఒకే చితిపై ఏడుగురు
ప్రభుత్వ పాఠశాలల ఎనిమిదో తరగతి విద్యార్థులకు నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందించేలా పరీక్ష నిర్వహించనున్నారు.
రజాకార్ల అరాచకాలకు ఉమ్మడి జిల్లా ఎదురొడ్డి నిలిచింది. నిజాం సేనల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పలువురు ప్రాణాలను ఫణంగా పెట్టారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్, గ్రామాల్లోని దొరల ఆగడాలు, అణచివేతపై జిల్లా తిరగబడుతూ బందూకులై గర్జించారు. తద్వారా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పుటల్లో జిల్లాకు ప్రత్యేక స్థానం లభించింది. నాటి పోరాటం, అమరుల స్మరణతో ఏటా సెప్టెంబర్ 17న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కణకణం..
అగ్నిగోళం
రావెళ్ల మార్గదర్శకంలో..
బోనకల్ మండలం చిరునోములకు చెందిన రావెళ్ల జానకీరామయ్య వరంగల్ జిల్లా ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో యువత కదం తొక్కింది. భూస్వాములు, జమీందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా జానకీరామయ్య నేతృత్వాన లక్ష్మీపురంలోని మల్లెల వెంకటేశ్వర్లు దళ కమాండర్‌గా, గోవిందాపురానికి చెందిన తమ్మారపు గోవిందు, చుండూరు నరసింహారావు, జొన్నలగడ్డ రామయ్య ఉప కమాండర్లుగా పోరాడారు. లక్ష్మీపురంతోపాటు బ్రాహ్మణపల్లి, ముష్టికుంట్ల తదితర గ్రామాల యువకులు ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు.
ఎర్ర కెరటమైన పిండిప్రోలు
తెలంగాణ సాయుధ పోరులో తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు ఎర్ర కెరటమైంది. కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి రాంకిషన్‌రావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, రాయల వెంకటనారాయణ వంటి నేతలు ఇక్కడే సమావేశాలు నిర్వహించి పోరాటానికి ఊపిరిలూదారు. దున్నే వాడిదే భూమి అన్న నినాదంతో లక్షలాది ఎకరాలను పేదలకు పంచారు. గ్రామానికి చెందిన రాయల వెంకటనారాయణ దళ కమాండర్‌గా పనిచేయగా.. పలువురు యువకులు పోరాటంలో అమరులయ్యారు.
తిరుగుబావుటా
నిజాం నవాబుల పాలనపై ఎర్రుపాలెం మండలం మీనవోలు పోరాటయోధులు తిరగబడ్డారు. ఎర్రుపాలెంలో నిజాం నవాబులు క్యాంపు ఏర్పాటుచేస్తే, క్యాంప్ ఇన్‌చార్జి, బ్రిటిష్ అధికారి సార్జెంట్ తరచూ దాడులతో ప్రజల సొమ్ము కాజేసేవారు. దీంతో 1948 జనవరి 15న గ్రామస్తులంతా తిరగబడ్డారు. ఈటెలతో దాడి చేయగా.. సార్జెంట్ విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రాంపల్లి రామయ్య, సుఖభోగి ముత్తయ్య, తోట బాలయ్య, పిల్లి కాటయ్య, బండి వీరయ్య, మెట్టల శ్రీరాములు, తోట వెంకయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆతర్వాత తిరుగుబాటును అణచివేసేలా రజాకార్లను రైలులో రప్పించి పలువురి ఇళ్లను తగలబెట్టారు. గ్రామంలో పరిస్థితి చేయి దాటడంతో పలువురు ఊరు విడిచివెళ్లారు.
నేడు సాయుధ పోరాట వారోత్సవాల సభ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో బుధవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. గత వారం రోజులుగా అమరువీరులకు నివాళులర్పించడమేకాక సభను విజయవంతమయ్యేలా ప్రచారం చేశామని వెల్లడించారు. ఈమేరకు బుధవారం జరిగే సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబి, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావుతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.
3
రజాకార్లకు ఎదురొడ్డిన ఉమ్మడి జిల్లా
నాటి మధిర తాలుకాలో నిజాం సైన్యం, రజాకార్ల మూకలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుల కోసం గాలించాయి. గోవిందాపురం సరిహద్దు వద్ద 1948 ఫిబ్రవరి 10న వివిధ గ్రామాలకు చెందిన యల్లమందల చంద్రయ్య, మంద అచ్చయ్య, మద్ది రాములు, గొర్రుముచ్చు హాజరయ్య, కొత్తపల్లి కృష్ణమూర్తి, సామినేని గోపయ్య, మడుపల్లి వీరస్వామి, తమ్మినేని బుచ్చయ్య, తమ్మారపు వెంకటకోటయ్యను బంధించగా వెంకటకోటయ్య సైన్యం కళ్లుకప్పి తప్పించుకున్నారు. ఇక కృష్ణమూర్తి చిన్నవయస్కు డని వదిలివేశారు. మిగిలిన ఏడుగురిని జనం చూస్తుండగా మంగలి గుట్టపై చంపి ఒకే చితిపై కాల్చారు.

ప్రతిభావంతులకు ప్రోత్సాహం

ప్రతిభావంతులకు ప్రోత్సాహం