
యూనిట్లకు సకాలంలో అనుమతులు
ఖమ్మం సహకారనగర్: పరిశ్రమలకు సంబంధించి యూనిట్ల ఏర్పాట్లకు అందిన దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి టీజీ ఐ–పాస్ కమిటీ సమావేశంలో పలు దరఖాస్తులు, అభ్యంతరాలను సమీక్షించారు. ఇందులో గ్రానైట్, రైస్ మిల్లులు, క్రూడ్ పామాయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సరైన వనరులు ఉన్నందున ఔత్సాహికులను ప్రోత్సహించాలని తెలిపారు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదే సమయాన స్థానిక యువతకు ఉపాధి లభించేలా డిగ్రీ కళాశాలలు, ఐటీఐల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సీతారాం, మైనింగ్ ఏడీ సాయినాథ్, ఆర్‌టీఓ వెంకటరమణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి కె.శ్రీరామ్, గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.యుగంధర్, కె.గోపాల్‌రావు పాల్గొన్నారు.
రక్షణ సామగ్రి పంపిణీ
ప్రకృతి విపత్తుల సమయాన ఉపయోగించే రక్షణ సామగ్రిని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లకు అందజేశారు. వీటిని విపత్తుల సమయాన వినియోగానికి భద్రపర్చాలని సూచించారు. ఇందులో మైక్‌లు, టార్చిలైట్లు తదితర సామగ్రి ఉన్నాయి. డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, తహసీల్దార్లు పి.రాంప్రసాద్, అరుణ, శ్వేత, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శర్మ పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి