ఖమ్మంమయూరిసెంటర్: నేపాల్‌లో తిరుగుబాటుకు రాజకీయ అస్థిరత్వం, అవినీతి అంతర్గత కారణాలు గా నిలిస్తే, దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా తదితర దేశాల చర్యలు బాహ్య కారణాలుగా ఉన్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు అన్నారు. ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో మాస్‌లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని నియంత్రించడానికి అమెరికా అదృశ్యశక్తిగా పనిచేస్తోందని తెలిపారు. నేపాల్‌లో దాడుల్లోనూ ఆ దేశ పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కాగా, సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల అశోక్, శిరోమణి, శోభ, కె.శ్రీను, ఆజాద్, రాకేష్, లక్ష్మణ్, వెంకటేష్, లెనిన్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు