
చర్రితను వక్రీకరిస్తే మారేది కాదు...
నేలకొండపల్లి: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించాలని చూసినా మారబోదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్రను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. నాడు కమ్యూనిస్టులే ప్రజలను చైతన్యం చేస్తూ నైజాం, దొరల దోపిడీపై పోరాడుతూ వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారని తెలిపారు. కాగా, రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ బుధవారం ఖమ్మంలో జరగనుండగా పార్టీ జాతీయ కార్యదర్శి ఎం.ఏ.బేబి, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పాల్గొంటారని, ఈ సభకు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. నాయకులు బండి రమేష్, బషీరుద్ధీన్, గుడవర్తి నాగేశ్వరరావు, కే.వీ.రెడ్డి, ఏటుకూరి రామారావు, మారుతి కొండలరావు, రచ్చా నరసింహారావు తదిరులు పాల్గొన్నారు.
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
వైరా: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటా లు నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సూచించారు. వైరా మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనలో అఽధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం బొంతు సమత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు దిగొచ్చే వరకు ఆందోళనలు నిర్వహించాలని తెలిపారు. ఖమ్మంలో బుధవారం జరిగే సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని కోరారు. ఈసమావేశంలో నాయకులు సుంకర సుధాకర్ , భూక్యా వీరభద్రం, చింతనిప్పు చలపతిరావు, మచ్చామణి, గుడిమెట్ల రజిత, సాంబశివరావు, సుధాకర్, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు