
గేమ్ చేంజర్‌గా ఖమ్మం–దేవరపల్లి హైవే
● కొత్త సంవత్సరంకల్లా అందుబాటులోకి రహదారి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం అర్బన్: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే తెలంగాణ నుంచి దక్షిణ భారతదేశానికి మధ్య రవాణా సౌకర్యం మెరుగై గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం ధంసలాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆర్‌ఓబీ, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను కలెక్టర్ అనుదీప్, అధికారులతో కలిసి మంత్రి శనివారం పరిశీలించారు. హైవే నిర్మాణ పనులు వేగంగా చేపడుతూ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ధంసలాపురం ఆర్‌ఓబీని నవంబర్ చివరి నాటికి ఓ వైపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరంలో హైవే అందుబాటులోకి వస్తే 160 కి.మీ. పొడవైన ఈ రహదారి మీదుగా రాజమండ్రికి గంటన్నరలో చేరుకోవచ్చని తెలిపారు. ఖమ్మం–సత్తుపల్లి మార్గంలో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తే రైతులకు అనుకూలంగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్‌కు సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నేషనల్ హైవే పీడీ దివ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్, కేఎంసీ కమిషనర్ అభిషేక్, ఆర్డీఓ నర్సింహారావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు, ఆళ్ల నిరీషాఅంజిరెడ్డి, కమర్తపు మురళి, సొసైటీల చైర్మన్లు తుపాకుల యలగొండ స్వామి, రావూరి సైదాబాబు, తహసీల్దార్ సైదులు, నాయకులు సాదు రమేష్‌రెడ్డి, తుంపాల కృష్ణమోహన్, బోడా శ్రావణ్‌కుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.