
కట్టుదిట్టమైన భద్రత మధ్య నిమజ్జనం
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వినాయక నిమజ్జనం శనివారం ప్రశాంతంగా కొనసాగింది. పలువురు మండపాల నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరడంతో అర్ధరాత్రి వరకు కూడా నిమజ్జనాలు కొనసాగాయి. 500 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయడం, ముందస్తు ప్రణాళికతో ఇక్కట్లు ఎదురుకాలేదు. కలెక్టర్ అనుదీప్, కేఎంసీ కమిషనర్ అగస్త్యతో కలిసి సీపీ సునీల్‌దత్ ఏర్పాట్లను పరిశీలించారు. సీపీ దంపతులు మట్టి ప్రతిమను నిమజ్జనం చేశారు. అడిషనల్ డీసీపీలు ప్రసాద్‌రావు, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు, సుశీల్‌సింగ్, సీఐ కరుణాకర్ బందోబస్తును పర్యవేక్షించారు.