
స్వామీ.. సెలవిక !
న్యూస్‌రీల్
జిల్లా కేంద్రంలో ఘనంగా వినాయక నిమజ్జనం
ఆకట్టుకున్న శోభాయాత్ర, సాంస్కృతిక ప్రదర్శనలు
కలెక్టర్, సీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాట్లు
వీక్షించేందుకు మున్నేటికి ఇరువైపులా జనం బారులు
జిల్లా కేంద్రంలో వాడవాడనా ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నవరాత్రుల పూజల అనంతరం శనివారం నిమజ్జనం చేశారు. మున్నేటికి ఇరువైపులా నిమజ్జన ఘాట్లు ఏర్పాటుచేయగా మధ్యాహ్నం తర్వాత శోభాయాత్ర మొదలైంది. గాంధీచౌక్ వద్ద ప్రత్యేక వేదిక నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్‌దత్, మేయర్ నీరజ, స్తంభాద్రి ఉత్సవ కమిటీల ప్రతినిధులు శోభాయాత్రకు స్వాగతం పలికి పూజలు చేశారు. ఇక మున్నేటి వద్ద నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్, సీపీతో పాటు కేఎంసీ కమిషనర్ అభిషేక్ పర్యవేక్షించారు. పెద్దసంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయగా అర్ధరాత్రి వరకు కొనసాగిన నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
శోభాయాత్రలో డప్పు వాయిస్తున్న మహిళ

స్వామీ.. సెలవిక !