
శ్రీవారికి అభిషేకం, కల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యా ణం, పల్లకీ సేవ నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కొత్తూ రి జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్ప ల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
వైరా కేవీకేకు పురస్కారాలు
వైరా: వైరాలోని కృషివిజ్ఞాన కేంద్రానికి నాలు గు పురస్కారాలు లభించాయి. తమిళనాడులో ని కోయంబత్తూరులో శనివారం అటారి జోన్–10 పరిధి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఉన్న 72 కేవీకే అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2024–25 ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చించారు. వైరా కేవీకే ఆధ్వర్యాన నేరుగా వరి విత్తే పద్ధతిపై అవగాహన, రైతుల డేటా బేస్ నమోదు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు గాను నాలుగు అవార్డులు ప్రకటించగా కోఆర్డి నేటర్ డాక్టర్ టి.సుచరితాదేవి అందుకున్నారు.
ఆలిండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు 173 మంది
ఖమ్మంస్పోర్ట్స్: ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నీలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యాన ఎంపిక చేశారు. ఈమేరకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం 15క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించగా 320మంది ఉద్యోగులు హాజరయ్యారు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చూపిన 173మందిని ఎంపిక చేసినట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. వీరు ఈనెల 9, 10వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
‘పరిషత్’ ఓటర్లు.. 8,02,690మంది
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా ను శనివారం విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా జిల్లాలో 8,02,690 మంది ఓటర్లు ఉన్నారని జెడ్పీ సీఈఓ దీక్షారైనా తెలిపారు. వీరిలో మహిళలు 4,14,425మంది, పురుషులు 3,88,243మంది, ఇతరులు 22మంది ఉన్నారని వెల్లడించారు. జెడ్పీతో పాటు మండల పరిషత్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించినట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనుండగా.. 9వ తేదీన పరిష్కరించి 10వ తేదీన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను వెల్లడిస్తామని సీఈఓ పేర్కొన్నారు. అంతకుముందు 8వ తేదీన జిల్లా, మండల కేంద్రాల్లో వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
‘స్వగృహ’కు
రెండు బిడ్లు దాఖలు
ఖమ్మం సహకార నగర్: ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహలో ఫ్లాట్ల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానించగా రెండు బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగ సంఘాల నుంచి ఒకటి, కాంట్రాక్టర్ నుంచి ఇంకొకటి దాఖలైనట్లు అధికారులు తెలిపారు. రాజీవ్ స్వగృహ 9.22 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, 576 ఫ్లాట్లలో చదరపు అడుగు ధర రూ.1,150గా ధర నిర్ణయించి బిడ్లు ఆహ్వానించారు. శనివారంతో గడువు ముగియగా ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్టర్ నుంచి రూ.5కోట్లతో బిడ్లు దాఖలైనట్లు తెలిసింది. కాగా, దరఖాస్తులను అధికారులు సోమవారం పరిశీలించనున్నారు.

శ్రీవారికి అభిషేకం, కల్యాణం

శ్రీవారికి అభిషేకం, కల్యాణం

శ్రీవారికి అభిషేకం, కల్యాణం