
బీజేపీ వైఖరితో సెక్యులరిజానికి ముప్పు
నేలకొండపల్లి : కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలతో సెక్కులరిజానికి పెను ముప్పు పొంచి ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మండలంలోని మోటాపురంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. నిత్యం మత ఘర్షణలు సృష్టిస్తూ ఓట్ల రాజకీయం చేస్తోందని, ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు కాకుండా కుట్ర పన్నుతోందన్నారు. దేశంలో ఏనాడూ బీసీల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్.. బీసీ రిజర్వేషన్ల పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను విస్మరించిందని, అమలు కానీ హమీ లతో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో హడావిడి చేస్తోందని విమర్శించారు. సమావేశంలో పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, నాయకులు బండి రమేష్, కేవీ.రెడ్డి, రాజశేఖర్, సుదర్శన్‌రెడ్డి, కొమ్ము శ్రీను, రచ్చా నరసింహారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, బెల్లం లక్ష్మి, ఏటుకూరి రామారావు, భూక్యా కృష్ణ, ఇంటూరి ఆశోక్ పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని