
మాస్‌లైన్ జాతీయ నేత ప్రదీప్‌సింగ్
మైనార్టీలను శత్రువులుగా చూస్తున్నారు..
ఇల్లెందు : కేంద్రంలో నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక మైనార్టీలను శత్రువులుగా చూడడమే కాక, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు వారిని వేటాడి హతమారుస్తున్నారని సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఆందోళన వ్యక్తం చేశారు. మాస్‌లైన్ దివంగత నాయకులు రాయల చంద్రశేఖర్, గండి యాదగిరి స్మారక స్తూపాలను ఇల్లెందులో బుధవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో ఒక శాతం ఉన్న కార్పొరేట్ శక్తులకు సంపద కట్టబెడుతూ ప్రశ్నించిన వారిపై నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.