
నిజాయితీగా సేవలతో ఉన్నత స్థాయికి..
ఖమ్మంఅర్బన్: నిజాయితీతో ప్రజలకు సేవలందించడం ద్వారా ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మంలోని ఐటీ హబ్‌లో ఇందిరా మహిళాశక్తి ద్వారా డిజిటల్ ఇండియా మోడల్ సీఎస్‌సీల నిర్వాహకులకు ఇస్తున్న శిక్షణను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 70 మంది మహిళా సంఘాల సభ్యులకు తరుణి హాట్‌లో శిక్షణ ఇవ్వగా, ఇంకొందరికి ఐటీ హబ్‌లో తెలంగా ణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా ఈడీపీ, ఐటీ అంశంలో శిక్షణ ఇప్పించామని తెలిపారు. ఆధార్‌కార్డ్, బ్యాంకింగ్ సేవలు, ప్రభు త్వ పథకాల సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసేలా కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటుకు చేయూతనిస్తామని చెప్పారు. అనంతరం శిక్షణ పొందిన వారితో కలిసి కేక్ కట్ చేసిన కలెక్టర్ వారికి బయోమెట్రిక్ యంత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీఎస్‌సీ ప్రాజెక్టు మేనేజర్ బి.హరికృష్ణకుమార్, టాస్క్ ఆర్‌ఎం అశోక్‌కుమార్‌నాయక్‌తో పాటు షేక్ ఫయాజ్, సురేశ్‌కుమార్, బాలూ ప్రవరాఖ్య, శ్రీనివాస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.