
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు
● అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ
సత్తుపల్లిటౌన్: ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నందున శ్రద్ధగా చదువుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, రేజర్ల ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడమే కాక ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎక్కువ మంది చేరడం, పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చడంపై ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, ఉపాధ్యాయులను అభినందించారు. ఆతర్వాత విద్యార్థులతో కలిసి ఆమె మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొండ్రు నర్సింహ, ఎంపీఈఓ కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పకడ్బందీగా భూభారతి చట్టం అమలు
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
బోనకల్: భూభారతి చట్టం పకడ్బందీగా అమలయ్యేలా ఉద్యోగులు శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బోనకల్ తహసీల్‌ను గురువారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించారు. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్, పరిశీలన, పరిష్కారంపై ఆరా తీసి సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ విద్యార్థుల ప్రగతిని పరీక్షించాక ఆవరణలో మొక్కలు నాటారు. హాస్టల్ భవనం స్లాబ్ పెచ్చులు పడుతుండడం, ప్రహరీ లేక ఎదురవుతున్న ఇబ్బందులను ప్రిన్సిపాల్ పద్మావతి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్ రమాదేవి, ఆర్‌ఐలు నవీన్, మైథిలి పాల్గొన్నారు.
ఎంపీఓలకు
ఎంపీడీఓలుగా బాధ్యతలు
ఖమ్మంసహకారనగర్: జిల్లాలోని నాలుగు మండలాల ఎంపీడీఓలు సొంత జిల్లాలకు బదిలీ కావడంతో అక్కడ ఎంపీఓలకు ఎంపీడీఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కారేపల్లి ఎంపీడీఓ జి.సురేందర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లగా అక్కడ ఎంపీఓ ఎం.రవీంద్రప్రసాద్‌కు బాధ్యతలు అప్పగిస్తూ జెడ్పీ సీఈఓ దీక్షారైనా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, మహబూబాబాద్ జిల్లాకు వెళ్లిన ఖమ్మంరూరల్ ఎంపీడీఓ ఎస్.కుమార్ స్థానంలో ఎంపీఓ కె.శ్రీదేవికి, కూసుమంచి ఎంపీడీఓ డి.వేణుగోపాల్‌రెడ్డి స్థానంలో ఎంపీఓ ఎం.రామచందర్‌రావుకు, కొణిజర్ల ఎంపీడీఓ ఏ.రోజారాణి స్థానంలో ఎంపీఓ ఉపేంద్రయ్యకు బాధ్యతలు అప్పగించారు. బదిలీ అయిన ఎంపీడీఓలు 2024 లోక్‌సభ ఎన్నికల సమయాన జిల్లాకు రాగా.. ఇప్పుడు మళ్లీ సొంత జిల్లాలకు బదిలీ అయ్యారు.
లక్ష్యం మేర
బొగ్గు ఉత్పత్తి, రవాణా
సత్తుపల్లిరూరల్: బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించి రోజువారీ లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు ఆదేశించారు. సత్తుపల్లిలో జేవీఆర్ ఓసీ, సీహెచ్‌పీలను గురువారం ఆయన కొత్తగూడెం ఏరియా జీఎం షాలేం రాజుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, ఉద్యోగుల రక్షణ చర్యలపై సూచనలు చేశారు. అలాగే, జేవీఆర్ సీహెచ్‌పీ నుంచి రైలుమార్గం బొగ్గు రవాణాను పరిశీలించిన డైరెక్టర్ సైలో బంకర్ వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీయడమే కాక వ్యూ పాయింట్ వద్ద మొక్కలు నాటారు. ఉద్యోగులు కోటిరెడ్డి, సూర్యనారాయణరాజు, ప్రహ్లాద్, నర్సింహారావు, సోమశేఖర్, మోహన్‌రావు, యోహాన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు