
జిల్లాలోని పలుచోట్ల వర్షం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం 6–30 గంటల తర్వాత మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది. అయితే, గాలిదుమారం కారణంగా పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రహదారులపై పడడంతో వాహన రాకపోకలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేంసూరులో అత్యధికంగా 87 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా మధిరలో 67.3 మి. మీ.లు, మధిర ఏఆర్‌ఎస్ వద్ద 50.3, పల్లెగూడెంలో 42.8, గేటుకారేపల్లిలో 40.5, తిరుమలాయపాలెంలో 39, పెద్దగోపతిలో 27.5, కూసుమంచిలో 25.3, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 23.3, రఘునాథపాలెంలో 23, రావినూతలలో 21.8, సదాశివునిపాలెంలో 20.8 వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, ఈ వాన సాగులో ఉన్న పంటలకు ప్రయోజనం కలిగిస్తుందని చెబుతున్నారు.