
నాణ్యతతో పాటు వేగం ముఖ్యమే..
ఖమ్మంఅర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించడమే కాక వేగంగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం 37వ డివిజన్‌లో గురువారం రూ.175 లక్షలతో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టే పనుల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కాగా, రహదారుల వెడల్పుతో మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడడమే కాక ట్రాఫిక్ ఇక్కట్లు తీరుతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, శరత్, కమర్తపు మురళి, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు, కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మందడపు మనోహర్, షాకిత్ అలీ, ముక్తార్, నాగండ్ల దీపక్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు