
వాతావరణ ం
జిల్లాలో గురువారం ఎండ ప్రభావం పెరిగే అవకాశముంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రత తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.
●పెద్దాస్పత్రి కిటకిట
జిల్లా జనరల్ ఆస్పత్రి బుధవారం కిటకిటలాడింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి తోడు దగ్గు, ఒంటి నొప్పులతో పలువురు
బాధపడుతుండగా.. ఎండవేడితో కొందరు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారని తెలుస్తోంది. దీంతో చికిత్స కోసం పెద్దాస్పత్రి బాట పడుతున్నారు. గత వారం రోజులుగా 1,500 మందికి పైగా ఓపీ విభాగంలో చికిత్సకు వస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇందులో ఎక్కువగా వృద్ధులు ఉంటున్నారని, ఇదే సమయాన ఇన్ పేషంట్లు
పెరుగుతున్నారని తెలుస్తోంది. అయితే, వాతావరణంలో మార్పుల నేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. – ఖమ్మం వైద్యవిభాగం