
కేంద్రం, ఏపీ ప్రభుత్వాలవి ఫాసిస్ట్ చర్యలు
ఖమ్మంమయూరిసెంటర్: ఈనెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా కేంద్రంతోపాటు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఫాసిస్ట్ చర్యలకు పాల్పడుతోందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతదేహాలకు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు భయపడుతున్నాయని తెలిపారు. ఇప్పటికై నా మృతదేహాలను బంధువులకు అప్పగించి.. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేలా చూడడంతో పాటు నిర్బంధం, బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వాలు, పోలీసుల వైఖరి గమనిస్తే మావోయిస్టులను పట్టుకొచ్చి కాల్చి చంపినట్లుగా వస్తున్న వార్తలను విశ్వసించాల్సి వస్తోందని తెలిపారు. మధ్య భారతంలో నరమేధం సృష్టిస్తున్న పాలకులు, సరిహద్దుల్లో చేయాల్సిన యుద్ధం దండకారణ్యంలో చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్లు, ఆదివాసీల మరణా ల పై న్యాయ విచారణచేయాలని రంగారావు డిమాండ్ చేశారు. మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్స య్య మాట్లాడగా నాయకులు గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, గుండమళ్ల రామయ్య, ఝా న్సీ, మలీదునాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు