
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.కిరణ్‌కుమార్‌కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ఓయూ ప్రొఫెసర్ కె.సాధన పర్యవేక్షణలో ఆయన ‘స్ట్రక్చరల్ ఆప్టికల్ స్పెక్ట్రోస్కోపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డోపెడ్ జింక్ అల్యూమినేట్ ఫర్ ఎలక్ట్రో కెమికల్ అప్లికేషన్‘ అంశంపై పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించగా డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా కిరణ్‌కుమార్‌ను కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా, వివిధ విభాగాల బాధ్యులు ఎం.ప్రసాద్, బి.అనిత, డాక్టర్ బి.శ్రీనివాస్, ఎస్.రాంబాబు, రాజశేఖర్,ఽ ధర్మయ్య మంగళవారం అభినందించారు.
పరీక్షలు పకడ్బందీగా
నిర్వహించాలి
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి అడ్వా న్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) పద్మశ్రీ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. వచ్చే నెల 3నుంచి 11వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనుండగా, 1,048 మంది విద్యార్థుల కోసం ఖమ్మంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కు రెండు రోజుల ముందు వరకు కూడా రూ. 50జరిమానాతో ఫీజు చెల్లించే అవకాశమున్న విషయమై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ సత్యనారాయణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కారుమంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22న ప్రారంభం కాగా మంగళవారం ముగిశాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 27,775 మందికి 25,972మంది, ద్వితీయ సంవత్సరంలో 6,514మందికి 6,148మంది విద్యార్థులు హాజ రయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు.
రేపటి నుంచి మూల్యాంకనం
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ల జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు చేపట్టనున్నారు. మొదటి విడత 29న, రెండో విడత ఈనెల 31 న మొదలవుతుంది. జిల్లాకు ఇప్కపటికే 69,835 జవాబుపత్రాలు చేరాయని డిడీఈఓ రవిబాబు తెలిపారు. ఈమేరకు వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
కొత్త వ్యవసాయ మార్కెట్
ఏర్పాటుకు శ్రీకారం
చింతకాని: చింతకాని, ముదిగొండ మండలాల రైతులకు సేవలందించేలా నూతన మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా చింతకాని మండలం మత్కేపల్లి పరిధి 41వ సర్వేనంబర్‌లో భూసేకరణకు మార్కెటింగ్, రెవె న్యూ అధికారులు మంగళవారం సంయుక్తంగా సర్వే చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, మార్కెట్ సహాయకార్యదర్శి వీరాంజనేయులు, సర్వేయర్ నవీన్ సర్వేలో పాల్గొన్నారు. ఇక్కడ మార్కెట్ ఏర్పాటైతే రెండు మండలాల రైతులకు దూరాభారం తప్పడమే కాక పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభిస్తుందని చెబుతున్నారు.