తొలిసారి ఉమ్మడి జిల్లాకు రానున్న ప్రియాంకగాంధీ.. | Sakshi
Sakshi News home page

తొలిసారి ఉమ్మడి జిల్లాకు రానున్న ప్రియాంకగాంధీ..

Published Fri, Nov 24 2023 12:20 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ప్రచారం చేస్తారు. తొలిసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రియాంకాగాంధీ రానుండడంతో రోడ్‌షోలను విజయవంతం చేసేందుకు గాను నాయకులు భారీ జనసమీకరణలో నిమగ్నమయ్యారు.

ఇప్పటికే రాహుల్‌గాంధీ పినపాక నియోజకవర్గానికి సంబంధించి మణుగూరులో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రియాంకాగాంధీ వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఆమె ప్రచా రం చేయనుండగా, శనివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ప్రచారానికి హాజరవుతారు.

రెండు రోజులు ఉమ్మడి జిల్లాలోనే..
కొత్తగూడెంలో శుక్రవారం సాయంత్రం 3.25గంటల నుంచి 4.20 గంటల వరకు జరిగే సభలో ప్రియాంక పాల్గొంటారు. ఆ తర్వాత హెలీకాప్టర్‌లో ఖమ్మం చేరుకుని ఇక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 11.30 గంటలకు జెడ్పీ సెంటర్‌ నుంచి వైరా రోడ్‌, మయూరిసెంటర్‌, కాల్వొడ్డు, పెదతండా మీదుగా నాయుడుపేట వరకు జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు. దీంతో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ప్రచారం చేసినట్లవుతుంది.

ఆ తర్వాత మధ్యాహ్నం 1.05 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరుకు చేరుకుంటారు. అక్కడ 1.30నుంచి 2.30 గంటల వరకు జరిగే కార్నర్‌ మీటింగ్‌లో పార్టీ అభ్యర్థి మట్టా రాగమయితో కలిసి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 3నుంచి 4గంటల వరకు మధిరలో భట్టి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటుచేసే సభలో ప్రియాంకాగాంధీ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం..! పవన్‌ కల్యాణ్‌

Advertisement
Advertisement