ప్రైవేటు వర్సిటీకి రూ.1.40 కోట్లు బురిడీ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వర్సిటీకి రూ.1.40 కోట్లు బురిడీ

Oct 9 2026 2:08 AM | Updated on Oct 9 2026 2:08 AM

దొడ్డబళ్లాపురం: యూనివర్సిటీ చైర్మెన్‌ ఫోటో, ఫోన్‌ నంబర్‌ను ఉపయోగించి ఆయన పేరుతో వర్సిటీ ఖాతా నుంచి రూ.1.40 కోట్లు కొల్లగొట్టిన సంఘటన బెంగళూరు జైన్‌ యూనివర్సిటీలో వెలుగు చూసింది. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైం పోలీసులు గాలించి అణ్ణయ్య, రవికుమార్‌ రెడ్డి, అంబరాయ, సయ్యద్‌ వజిహుద్దీన్‌ అనే నిందితులను అరెస్టు చేశారు. వారి రూ.8.50 లక్షల నగదు, 4 మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. సన్ని అనే ముఖ్య నిందితురాలు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం మేరకు...

● సెప్టెంబరు 8న యూనివర్సిటీ అధ్యక్షుడు డా.చెన్‌రాజ్‌ రాయచంద్‌ ఫోటో, మొబైల్‌ నంబర్‌ ఉపయోగించి నకిలీ వాట్సాప్‌ ప్రొఫైల్‌ను రూపొందించిన నిందితులు వర్సిటీ అకౌంటెంట్‌ వినయ్‌ భూషణ్‌కు ఖాతాల బ్యాలెన్స్‌ వివరాలు పంపించాలని కోరారు.

● తమ చైర్మెనే అనుకున్న అతడు వివరాలను

పంపాడు.

● కొంతసేపటికి డబ్బులు బదిలీ చేయాలని సూచించడంతో, వినయ్‌ భూషణ్‌ రూ.1.40 కోట్లు బదిలీ చేశాడు.

●కాసేపటికి మోసపోయానని తెలుసుకున్న అతడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో డొంక కదిలింది.

● నిందితులు 20 రోజుల కిందటే జిప్‌ ఫైల్‌ని వినయ్‌ వాట్సాప్‌కి పంపించి నిఘా పెట్టారని తేలింది.

●ఈ ముఠా కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా 22 సైబర్‌ నేరాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. 62 మ్యూల్‌ అకౌంట్లు ఉపయోగించి డబ్బులు అందులో దాచేవారు. మొత్తం డబ్బులు ఎక్కడ దాచారనేది విచారణ సాగుతోంది.

ఘరానా సైబర్‌ నేర ముఠా గుట్టురట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement