నానా అనుబంధం | - | Sakshi
Sakshi News home page

నానా అనుబంధం

Oct 9 2026 2:08 AM | Updated on Oct 9 2026 2:08 AM

సాక్షి, బెంగళూరు: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, సహజ నటనతో అశేష ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటుడు నానా పటేకర్‌ మరణంతో శాండల్‌వుడ్‌, కన్నడ అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. ఉడుపి జిల్లా కార్కళ తాలూకా ముండ్కూరు గ్రామంతో నానా పటేకర్‌కు ప్రత్యేక అవినాభావ సంబంధం ఉంది. గ్రామంలోని శ్రీ దుర్గా పరమేశ్వరి దేవస్థానానికి తరచూ వచ్చేవారు. ముంబైలోని స్థానిక పారిశ్రామికవేత్త ముల్లడ్క గురుప్రసాద్‌, సుధాకర్‌ శెట్టితో స్నేహం ఉండేది. ఆలయ జీర్ణోద్ధరణ, గ్రామంలో విద్య, ధార్మిక అభివృద్ధికి తనవంతుగా చేయూతనందించారు. పాఠశాలలో కంప్యూటర్‌ గది, లైబ్రరీ నిర్మాణానికి సాయం చేశారు.

బెళగావితో

బెళగావితో కూడా నానా పటేకర్‌కు మంచి అనుబంధం ఉంది. 1990–91లో నానా పటేకర్‌ సూపర్‌ హిట్‌ సినిమా ప్రహార్‌ చిత్రీకరణ కొంత భాగం బెళగావి హిండలగా జైలులో జరిగింది.

యక్షలో పోలీసు పాత్ర

యాక్షన్‌ క్రైమ్‌ కన్నడ సినిమా యక్ష సినిమాలో నానా నటించారు. ఈ సినిమాలో హీరో తండ్రిగా, నిజాయితీ కలిగిన పోలీసు అధికారి (డీసీపీ) యోగరాజ్‌ పులకేశీగా పవర్‌ఫుల్‌ పాత్రలో నానా నటించారు. ఆయనే సొంతంగా కన్నడలో డబ్బింగ్‌ చెప్పడం విశేషం.

సీఎం డీకే సంతాపం

నానా పటేకర్‌ మరణ వార్త ఎంతో దుఃఖాన్ని తీసుకొచ్చింది. ఆయన లేకపోవడం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు అని సీఎం డీకే శివకుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు.

ఉడుపి జిల్లాలో సేవా కార్యక్రమాలు

కన్నడ మూవీ యక్షలో నటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement