రోజూ ముగ్గురు మంత్రులకు దసరా | - | Sakshi
Sakshi News home page

రోజూ ముగ్గురు మంత్రులకు దసరా

Oct 9 2026 2:08 AM | Updated on Oct 9 2026 2:08 AM

మైసూరు: మైసూరు దసరా మహోత్సవాలు ఎక్కడా లోటు లేకుండా జరగాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 11 రోజులు జరిగే ఉత్సవాలను ప్రతిరోజూ ముగ్గురు మంత్రులు పర్యవేక్షించాలని సీఎం డీకే శివకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 11వ తేదీన ఉత్సవాలు మొదలై 21వ తేదీన విజయదశమి రోజున జంబూసవారీ ఊరేగింపు, రాత్రి కాగడాల ప్రదర్శనతో సమాప్తమవుతాయి.

యువ సంభ్రమం

మరోవైపు దసరా యువ సంభ్రమలో కళాకారుల నృత్య విన్యాసాలు ఆహూతులను మురిపిస్తున్నాయి. గురువారం రాత్రి నృత్య ప్రదర్శనలు అలరించాయి.

పర్యవేక్షణ అప్పగించిన సీఎం

16 నుంచి కావేరి హారతి

మండ్య: శ్రీరంగపట్టణ దసరా సంబరాల సందర్భంగా కేఆర్‌ఎస్‌ బృందావన పార్కులో జరగాల్సిన కావేరి హారతి వేడుకలను మార్చినట్లు మంత్రి ఎన్‌.చలువరాయస్వామి తెలిపారు. 11 నుంచి 16 వరకు జరగాల్సి ఉంది, కానీ 16 నుంచి 21 వరకు నిర్వహించాలని తాజాగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు, పర్యాటకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement