మల్ల యుద్ధాలకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

మల్ల యుద్ధాలకు సన్నాహాలు

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

మైసూరు: మైసూరు దసరాలో జంబుసవారీ అంత ప్రసిద్ధి చెందినవి దసరా మల్ల యుద్దాలు. ఇవి మన నేల జాతీయ క్రీడ అని జిల్లా మంత్రి యతీంద్ర సిద్దరామయ్య అన్నారు. ఆదివారం నగరంలోని దేవరాజ్‌ అరస్‌ మైదానంలో దసరా కుస్తీ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ యోధుల ఉజ్జీ కట్టే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కుస్తీ పోటీల పోస్టర్‌ను విడుదల చేశారు. దసరా కుస్తీ పోటీలు రాజుల కాలం నుంచి కొనసాగుతున్నాయని, తమ ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు. దేశం నలుమూలల నుంచి చూడాలని ప్రజలు వస్తారని, 7 రోజుల పాటు జరిగే పోటీలలో పాల్గొనే మల్లయోధులందరికీ కమిటీ చక్కని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. దేవరాజ్‌ అరస్‌ స్టేడియంలో అక్టోబర్‌ 11 నుంచి 17 వరకు కుస్తీ పోటీలు అలరించబోతున్నాయి. నాడ కుస్తీ, పాయింట్‌ రెజ్లింగ్‌, పంజ కుస్తీ అనే మూడు రకాల పోటీలు జరుగుతాయి. ఎమ్మెల్యే టి.ఎస్‌. శ్రీవత్స, ఎస్పీ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement