తీర్థయాత్రలో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలో అపశ్రుతి

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు పట్టణ శివార్లలోని మహదేశ్వర ఐటీఐ కళాశాల ముందు ఆదివారం తెల్లవారుజామున రెండు కార్లు ఢీకొన్నాయి. బెంగళూరు నుంచి మలే మహదేశ్వర కొండకు భక్తులతో వెళ్తున్న కారు, కొల్లేగాళకు వస్తున్న కారు ప్రమాదానికి గురయ్యాయి. ఓ కారులోని సువర్ణ (37), లోకేష్‌ (20), శ్రేయ (16), రుక్మిణి (42), మంజేష్‌ (43), భాగ్యమ్మ (55), మహాదేవ (50), మరో కారులోని మన్సూర్‌ (38), మహమ్మద్‌ తౌఫిక్‌ (28), నిజాం (29) అనే 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రెండు కార్ల ముందుభాగాలు తుక్కుగా మారాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది స్థానికులు కలిసి అంబులెన్సులు లేకపోవడంతో ఆటోలలో ఆస్పత్రికి తరలించారు. హనూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. కార్లను అక్కడి నుంచి తొలగించి ఠాణాకు తరలించారు.

రెండు కార్లు ఢీ, 10 మందికి గాయాలు

చామరాజనగర జిల్లాలో ఘటన

బాధితుల్లో బెంగళూరువాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement