2 రోజులైనా దొరకని టెక్కీ జాడ | - | Sakshi
Sakshi News home page

2 రోజులైనా దొరకని టెక్కీ జాడ

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

బొమ్మనహళ్లి: సరదాగా సాగాల్సిన సమయం విషాదమయమైంది. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ తాలూకాలోని అత్తిబెలె దగ్గర సిద్దయ్యనదొడ్డి సమీపంలో ఉన్న క్వారీలోని నీటి కుంటలో శుక్రవారం సాయంత్రం ఈత కొట్టాలని దిగిన టెక్కీ జాడ ఇంకా దొరకలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గణేష్‌ ఆంజనేయ వినయ్‌ (30) బెంగళూరు హలసూరులో నివాసం ఉంటున్నాడు. సెలవు కావడంతో 8 మంది యువతీ యువకులతో విహారయాత్రకు వచ్చారు. వినయ్‌ లోతైన క్వారీ గుంతలోకి దిగి ఈత కొడుతుండగా మునిగిపోయాడు. స్నేహితులు అతని టీషర్టు పట్టి లాగితే టీషర్టు వారి చేతికి రాగా అతడు మునిగిపోయాడు. అప్పటినుంచి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది రబ్బరు బోట్లతో గాలింపు జరిపినా అతని ఆచూకీ దొరకడం లేదు.

కెమెరాతో గాలించినా..

క్వారీ లోతు సుమారు 100 అడుగులు లోతు ఉండగా, కెమెరాను 80 అడుగుల లోతుకు దించి చూసినా అతడు కనబడలేదని పోలీసులు తెలిపారు. ఆనేకల్‌ డీఎస్పీ గోపాల్‌ నాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ గాలింపును పరిశీలించారు. నీటికుంట వద్ద వేచిచూస్తున్న స్నేహితులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.

క్వారీ నీటికుంటలో గాలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement