కోలారు: నగరంలోని సహ్యాద్రి కళాశాలలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు అధికారి డాక్టర్ రేవతి మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన యువతీ యువకులు అందరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసిన మూడు నెలలలోగా కొత్త రక్తం దేహంలో తయారవుతుందన్నారు. ధీరజ్‌కమార్, డాక్టర్ భాగ్య తదితరులు పాల్గొన్నారు. 75 కు పైగా విద్యార్థులు రక్తదానం చేశారు.
ఆలయ నిర్మాణం గర్వకారణం
కోలారు: కాలజ్ఞానం రచించిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయాన్ని మాలూరు తాలూకాలోని మాస్తి గ్రామంలో నిర్మించడం గర్వించదగిన విషయమని అఖిల కర్ణాటక విశ్వకర్మ సమాజ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు వసంత మురళి అన్నారు. ఆదివారం మాలూరు తాలూకాలోని మాస్తి గ్రామ సమీపంలో ఉన్న హనుమంత నగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపారు. జగదీశ్వరాచారి, తదితరులు పాల్గొన్నారు.


