హంపీలో టూరిస్టుల సందడి | - | Sakshi
Sakshi News home page

హంపీలో టూరిస్టుల సందడి

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన

హంపీకి పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు కర్ణాటకలోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. విరుపాక్ష ఆలయం, విజయవిఠల ఆలయం, రాతి రథం, ఉగ్రనరసింహ తదితర చారిత్రక కట్టడాలను సందర్శించారు. యువత, విదేశీ పర్యాటకులు హంపీ వీధుల్లో తిరుగుతూ అందాలను వీక్షించారు. పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో హంపీలోని కొన్ని

ప్రాంతాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వాహనాల రాకపోకలను సులభతరం చేసి రద్దీని నియంత్రించారు. – హొసపేటె:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement