అరుదైన సర్పం లభ్యం | - | Sakshi
Sakshi News home page

అరుదైన సర్పం లభ్యం

Oct 4 2026 9:31 AM | Updated on Oct 4 2026 9:31 AM

కోలారు: అరుదుగా కనిపించే ఆలివ్‌ వాటర్‌ స్నేక్‌ కోలారు నగరంలోని మాస్తి కాలనీలో ఉంటున్న పశు వైద్యుడు డాక్టర్‌ రాహుల్‌ ఇంట్లో కనిపించింది. వెంటనే స్నేక్‌ నాగరాజ్‌కు ఫోన్‌ చేయడంతో ఆయన వచ్చి దానిని క్షేమంగా పట్టుకున్నారు. ఇది విష సర్పం కాదని తెలిపాడు. తరువాత దగ్గరలోనే ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశారు.

డిసెంబరులో

బెంగళూరు జాతర

బనశంకరి: బెంగళూరు ఘనతను చాటేలా డిసెంబరు 4 నుంచి 13 వరకు 10 రోజుల పాటు బెంగళూరు జాతరను ప్రభుత్వం నిర్వహిస్తుంది. నగరాభివృద్ధి మంత్రి కృష్ణబైరేగౌడ జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, విద్యాలయాలు, ఉద్యానవనాలు, రోడ్లు, సాంస్కృతిక కేంద్రాలు, మ్యూజియం తదతర కూడళ్లలో జాతర కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మెట్రో రైలుస్టేషన్లులలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టెక్కీ రవి అవయవదానం

● బైక్‌ ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌

యశవంతపుర: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన ఐటీ ఉద్యోగి అవయవ దానం చేసి చిరంజీవిగా నిలిచాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. హాసన్‌ జిల్లా హొళెనరసిపుర తాలూకా చాకేనహళ్లికట్టకు చెందిన చంద్రగౌడ, శివమ్మల ఏకై క కుమారుడు రవికుమార్‌ (31) బెంగళూరులో విప్రో కంపెనీలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. 3 నెలల క్రితం రవికుమార్‌ సొంతూరి వద్ద పరసనహళ్లి వద్ద బైకులో వెళ్తూ కింద పడడంతో తలకు బలమైన గాయాలు కాగా తల్లిదండ్రులు బెంగళూరు హెబ్బాళలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆనాటి నుంచి ఐసీయూలో ఉన్నాడు. అయితే చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు. చెట్టులా నీడనిస్తానడనుకున్న కొడుకు అచేతనంగా ఉండడం చూసి తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అయినప్పటికీ వైద్యుల విజ్ఞప్తి మేరకు అవయవదానానికి అంగీకరించారు. అలాగైనా తమ కుమారుడు ఇతరులలో జీవించి ఉంటాడని ఆశపడ్డారు. రవికుమార్‌ దేహం నుంచి ముఖ్యమైన అవయవాలను సేకరించి అవసరమైన రోగుల కోసం పంపించారు.

కుమార ట్వీట్‌లో

జెండా మారింది

దొడ్డబళ్లాపురం: ఏషియన్‌ గేమ్స్‌లో మహిళల పరుగు పోటీల్లో బంగారు, వెండి పతకాలు గెలిచిన కర్ణాటక క్రీడాకారిణి ఎంఆర్‌ పూవమ్మను అభినందించే క్రమంలో కేంద్రమంత్రి కుమారస్వామి పప్పులో కాలేశారు. ఎక్స్‌లో పెట్టిన పోస్టులో భారత జెండా ఎమోజీ బదులు హంగేరి దేశ జెండా బొమ్మ పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు ఏ దేశానికి జై కొడుతున్నారు కుమారణ్ణ అని కామెంట్లు చేశారు. ఈ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారు అని హేళన చేశారు.

స్కానింగ్‌ చేయిస్తానంటూ నగల చోరీ

● మైసూరు ఆస్పత్రిలో ఘటన

మైసూరు: మహిళ ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వస్తే, అక్కడ ఓ దొంగ నగలను దోచుకున్నాడు. మైసూరులోని కేఆర్‌ ఆస్పత్రి ఆవరణలో జరిగింది. వివరాలు.. నంజనగూడుకు చెందిన దేవమ్మ, భర్త కప్పణ్ణతో కలిసి వచ్చింది. ఆమెకు ఆరోగ్యం బాగా లేనందున స్కానింగ్‌కు రాసిచ్చారు. ఇంతలో ఓ వ్యక్తి వారిని కలిసి మీ పొరుగూరేనని పరిచయం చేసుకున్నాడు. స్కానింగ్‌ చేయించేందుకు సాయం చేస్తాననంటూ వారిని సెంటర్‌ వద్దకు పిలుచుకెళ్లాడు. భర్తను బయట కూర్చోబెట్టి దేవమ్మను లోపలికి పిలుచుకెళ్లాడు. బంగారు గొలుసు, కమ్మలు, అలాగే వెండి కడియాలను తీసి ఇవ్వమని, వాటిని మీ భర్తకు ఇస్తానని చెప్పడంతో ఆమె తీసి ఇచ్చింది. వాటి విలువ రూ.2.34 లక్షలు. స్కానింగ్‌ అయిన తర్వాత బయటకు వచ్చిన ఆమె భర్త వద్దకు వెళ్లి ఆభరణాలను ఇవ్వమని అడిగింది. దీంతో కప్పణ్ణ తనకు ఎవరూ ఏమీ ఇవ్వలేదని చెప్పాడు. దీంతో గాభరా పడిన ఆమె వెంటనే దేవరాజ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనారోగ్యానికి తోడు, నగల దోపిడీతో దంపతులు తీవ్ర విషాదానికి లోనయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement