125 ఏళ్లలో ఇదే తీవ్ర దుర్భిక్షం | - | Sakshi
Sakshi News home page

125 ఏళ్లలో ఇదే తీవ్ర దుర్భిక్షం

Oct 4 2026 9:31 AM | Updated on Oct 4 2026 9:31 AM

మైసూరు: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్రానికి వివరించామని, కేంద్రం ఎక్కువ పరిహారం అందిస్తుందన్న విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని పిరియాపట్టణలో అట్టహాసంగా ప్రజా సేవా అభియాన్‌ సభ జరిగింది. సీఎం మాట్లాడుతూ గత 125 ఏళ్లలో రాష్ట్రంలో ఇంతటి కరువు సంభవించలేదన్నారు. సర్‌ ప్రక్రియ గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి విచారణ జరిపింబోమన్నారు. తాను ఈసీ ఆఫీసు ముందు ధర్నాలో ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదన్నారు. నైస్‌ భూ అక్రమాలు, కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపణలపై చట్టపరంగా సమాధానమిస్తానని అన్నారు. రాష్ట్రంలో మొదటి దశలో 5 లక్షల మంది ఇళ్లు లేని పేదలకు స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు.

సీఎం డీకే విచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement