శివాజీనగర/ యశవంతపుర: జపాన్‌లో ఏషియన్ క్రీడా పోటీల్లో రిలే పరుగు పోటీల్లో బంగారు పతకం సాధించిన కన్నడ క్రీడాకారిణి ఎంఆర్ పూవమ్మ శనివారం మంగళూరు విమానాశ్రయానికి రాగానే అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. జాతీయ గీతం బ్యాండుతో స్వాగతం ఇవ్వడం సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. ఇది పూవమ్మకు మూడవ ఆసియా క్రీడలు కాగా, మొత్తంగా ఆమె గెలిచిన ఆరవ పతకం.
ఆ రాష్ట్రాల్లో భారీ కానుకలు
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులకు కర్ణాటక ప్రభుత్వం ఇస్తున్న నగదు కానుక చాలా తక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న మాదిరిగా అందించాలి అని పూవమ్మ కోరింది. మంగళూరులో సిటీ సెంటర్ మాల్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. హరియానా, పంజాబ్, కేరళ ప్రభుత్వాలు బంగారు పతకాలు సాధించిన తమ క్రీడాకారులకు రూ.3 – 4 కోట్లు నగదు బహుమతితో పాటు డీఎస్పీ స్థాయి ఉన్నత ఉద్యోగాన్ని ఇస్తున్నట్లు ఆమె తెలిపింది. అయితే కర్ణాటకలో రూ.25 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, ఇలాంటి వ్యత్యాసాలను సరిచేసి క్రీడకారులకు గౌరవం, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పతకం పొందిన వెంటనే తనకు ఎవరూ శుభాకాంక్షలు చెప్పలేదని బాధను వ్యక్తంచేసింది.
సీఎం ఆహ్వానం
పూవమ్మకు సీఎం డీకే శివకుమార్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. 6వ తేదీన బెంగళూరులో తనను కలవాలని ఆమెను ఆహ్వానించారు.
కర్ణాటకలో క్రీడాకారులకు తక్కువ పారితోషికాలు
ఏషియన్ స్వర్ణ పతక విజేత పూవమ్మ


