రాయచూరు రూరల్: జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వింత లీలలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సెకండ్ డివిజన్ గుమాస్తా(ఎస్‌డీసీ) సవిత పంత్‌కు వింత అనుభవం ఎదురైంది. కార్యాలయంలో చాలా మంది ఉద్యోగులు, సిబ్బంది కుర్చీల్లో కూర్చొని టేబుళ్లపై పని చేస్తుండగా సవిత పంత్ మాత్రం నేలపైనే కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో తోటి ఉద్యోగులు మహిళా ఉద్యోగిని అని కూడా చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదు చేసింది. గత కొన్నేళ్ల నుంచి అధికారులు తనపై కక్ష గట్టి ఇష్టానుసారంగా విభాగాలను మారుస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో జిల్లా విద్యా శాఖాధికారి బడిగేర్, సూపరింటెండెంట్ జగదీష్‌లను సంప్రదించగా, వారు కోర్టు పని మీద బెంగళూరు వెళ్లడంతో వారి నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు.
నేలపై కూర్చొనే ఉద్యోగిని విధులు.!


