బొలెరో ఢీకొని ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

బొలెరో ఢీకొని ఇద్దరు మృతి

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా వెంకటాపుర గ్రామంలో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపుర శివారులో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అటవీ శాఖ ఔట్‌ సోర్స్‌ వాచ్‌మెన్‌ సిబ్బంది వెంకటాపుర అటవీ శాఖలో విధులు ముగించుకొని తెల్లవారు జామున ఇంటికి వెళుతుండగా ఎదురుగా అతి వేగంగా వస్తున్న బొలెరో గూడ్స్‌ వాహనం బైక్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కమలాపురకు చెందిన కృష్ణ (26), వెంకటాపురకు చెందిన హనుమంతప్ప (50) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కమలాపుర పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బోలెరో గూడ్స్‌ వాహనాన్ని స్వాధీన పరచుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement