లవ్‌ జిహాద్‌పై నేహా తండ్రి ఆక్రోశం | - | Sakshi
Sakshi News home page

లవ్‌ జిహాద్‌పై నేహా తండ్రి ఆక్రోశం

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

హుబ్లీ: తన కుమార్తె హత్య, అత్యాచారం ఆరోపణల ఉదంతంలో అరెస్ట్‌ అయిన సమీర్‌, అతడి తండ్రి పాత్ర ఉండవచ్చని నేహా హిరేమఠ తండ్రి, కార్పొరేటర్‌ నిరంజన్‌ హిరేమఠ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియా వారికి వీడియోలో వివరించారు. నేహా హత్య కేసు నిందితుడు ఫయాజ్‌ కూడా అదే జిమ్‌లో శిక్షణ పొందేవాడు. తనకు సమీర్‌ తండ్రి అప్పుడప్పుడు ఫోన్‌ చేసేవాడు. మీ ఏరియాలో బాడీబిల్డింగ్‌ పోటీలు ఏర్పాటు చేద్దాం. దీనికి ఆర్థిక సహాయం చేయండి అంటూ డిమాండ్‌ చేసేవాడు. తమ ఇంటికి రావాలని కూడా ఆహ్వానించేవారు. నా భార్య బిరియానీ చేసింది. భోజనానికి రండి అంటూ ఆహ్వానించేవాడు. తాను జంగమ సమాజ వ్యక్తిని, మాంసాహారం తిననని తెలిపానన్నారు. ఆయన ఎంత పిలిచినా తాను వెళ్లలేదు. వెళ్లి ఉంటే ట్రాప్‌ చేసి ఉండేవాడేమో. నా కుమార్తె హత్య కేసులో కూడా సమీర్‌, అతడి సోదరి, తండ్రి కుమ్మక్కు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement