దుష్ట సంస్కృతి అంతం కావాలి | - | Sakshi
Sakshi News home page

దుష్ట సంస్కృతి అంతం కావాలి

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక సమాజంలో దుష్ట సంస్కృతి సంహారానికి మహిళలు ముందడుగు వేయాలని రిటైర్డ్‌ జిల్లా విద్యా శాఖ అదనపు అధికారిణి ఇందిరా పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సావిత్రిబాయి పూలే సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. 22వ శతాబ్ధంలో మహిళల గగన యాత్రలు, సాంకేతిక, విజ్ఞాన, సమాచార కేంద్రాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో అనేక మంది మహిళలు భ్రూణహత్యలు, వరకట్న చావులు వంటి విషయాల్లో న్యాయం, చట్టం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోందన్నారు. సమావేశంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ శావంతగేర రత్న, ఛాయాదేవి, జయశ్రీ, తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ కోస్గి, తహసీల్దార్‌ సురేష్‌ వర్మ, యంకప్ప, సంతోష్‌, నీలమ్మ, రాజశేఖర్‌, సరసుబాయిలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement