అక్రమ మద్యంపై మహిళల నిరసనాగ్రహం | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యంపై మహిళల నిరసనాగ్రహం

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

హుబ్లీ: తమ గ్రామంలో అడుగడుగున అక్రమ మద్యం అంగళ్లు ఉన్నాయని, దీని వల్ల యువత దారి తప్పుతున్నారని. తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు పాదయాత్ర చేపట్టడమే కాకుండా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సామూహికంగా ఆందోళన చేపట్టి పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. గంగావతి తాలూకా చిక్కజంతకల్‌లో కొన్ని నెలల నుంచి అక్రమ మద్యం అంగళ్ల జోరు పెరిగి పోయింది. కిరాణా అంగళ్లు, పాన్‌ బీడీ అంగళ్లలోనే కాకుండా చిన్న చితక కాయగూరలు అమ్మే తదితర అంగళ్లలో కూడా మద్యాన్ని విక్రయిస్తున్నారని మహిళలు మండిపడ్డారు.

మద్యంతో యువత పెడదోవ

కూలీ నాలీ చేసుకొనే పేదలు, ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు మద్యం సులభంగా దొరుకుతుంది. దీని వల్ల సంబంధిత కుటుంబాలపై తీరని దుష్పరిణామాలు పడ్డాయన్నారు. యువత మద్యం మత్తులో డబ్బులను వృధా చేస్తూ తమను నమ్ముకున్న వారిని బాధ పెడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అతి చిన్న గ్రామమైన తమ చిక్కజంతకల్‌, వినోబ నగర, నాగరహళ్లిలో సుమారు 15 నుంచి 20 మద్యం అంగళ్లు ఉన్నాయి. ఇవన్ని అక్రమమే అని, వీటిపై ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం కలగలేదన్నారు. ఆ శాఖ అధికారులే లంచాల కోసం అక్రమ మద్యం అంగళ్లను ప్రోత్సహిస్తున్నారని మహిళలు ఆరోపించారు. ఆ జిల్లా ఏఎస్పీ హేమంత్‌కుమార్‌, డీఎస్పీ న్యామగౌడలకు వినతిపత్రాలు అందజేశారు. అయితే ఎవరు అక్రమంగా మద్యం తెచ్చి అక్కడ అమ్ముతున్నారో సరైన సాక్ష్యాలు ఇవ్వాలని పోలీసులు ఆ మహిళలను కోరారు.

పాదయాత్రగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆందోళన

విచ్చలవిడి మద్యం అంగళ్లపై

చర్యకు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement