చాముండి బెట్టపై ధర్నాల హోరు
మైసూరు: నాడిన శక్తిదేవత కొలువైన చాముండి బెట్ట మీద ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను తక్షణమే నిలిపేయాలని బుధవారం కూడా వివిధ సంఘాలు ధర్నాలు చేశాయి. పర్యావరణ ప్రేమికులు, ప్రజలు దేవస్థానం ఎదుట గుమిగూడి అశాసీ్త్రయంగా జరుగుతున్న అభివృద్ధి పనులను నిలిపేయాలని నినాదాలు చేశారు. దేవస్థానం సమీపంలో శాశ్వత వేదిక నిర్మాణం కోసం తవ్వకాలు చేయడం సరికాదన్నారు. పర్యావరణం దృష్ట్యా ఈ ప్రదేశం సున్నితమైనదని, కుంగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. బెట్ట వారసత్వం దెబ్బతింటుందన్నారు. గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు.
అభివృద్ధి పనులపై నిరసన
చాముండి బెట్టపై ధర్నాల హోరు


