లారీని స్లీపర్‌కోచ్ బస్సు ఢీ
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగర శివార్లలో అగలగుర్కి బైపాస్ బ్రిడ్జి దగ్గర బెంగళూరు– హైదరాబాద్ జాతీయ రహదారి–44లో నిలిచి ఉన్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా, 12 మంది గాయపడ్డారు.
వివరాలు.. మైసూరు నుంచి బెంగళూరుకు వచ్చి, అక్కడి నుంచి ఏపీలోని మంత్రాలయ పుణ్యక్షేత్రానికి సుగమ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్ వెళ్తోంది. హైవే పక్కన రిపేరీ వచ్చి నిలిచి ఉన్న లారీని.. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా వచ్చి ఢీకొన్నాడు. బస్సు ఎడమవైపు తీవ్రంగా దెబ్బతింది. కొందరు ప్రయాణికులు బస్సులో చిక్కుకుపోగా స్థానికులు, పోలీసులు చేరుకుని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బస్సులో 9 మందికి, కంటైనర్ లారీలో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న ముగ్గురిని బెంగళూరుకు తరలించారు. కంటైనర్‌కు మరమ్మతు చేస్తున్న బిహార్‌కు చెందిన సుహాస్ (20) అనే కార్మికుడు ఈ దుర్ఘటనలో చనిపోయాడు.
ఓ వైపు ధ్వంసమైన బస్సు
చిక్కబళ్లాపురం వద్ద ప్రమాదం
9 మంది ప్రయాణికులకు గాయాలు
లారీ కార్మికుడు మృతి


