2028లో కుమారణ్ణే ముఖ్యమంత్రి
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా గురుమట్కల్ అభివృద్ధి పనులకు రాజీ పడేది లేదని, పార్టీలతో నిమిత్తం లేకుండా పనులు చేపడుతున్నట్లు శాసన సభ్యుడు శరణేగౌడ కందకూరు పేర్కొన్నారు. మంగళవారం తాలూకాలోని అల్లీపురలో రహదారి, సముదాయ భవనాలు, వివిధ పనులకు భూమిపూజ చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 2028లో రారష్ట్‌రంలో మైత్రికూటమి అధికారంలోకి వస్తే కుమారస్వామి ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. గురుమట్కల్ క్షేత్రంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జేడీఎస్ పార్టీలో చేరుతుండటం హర్షణీయమన్నారు. అభివృద్ధి విషయంలో పార్టీ భేద భావాలు లేకుండా ప్రజలతో ఎన్నికై న శాసన సభ్యుడికి నిధులు కేటాయించడం ప్రభుత్వ కర్తవ్యమన్నారు.
ఎమ్మెల్యే శరణేగౌడ జోస్యం
అభివృద్ధి పనుల్లో రాజీ లేదు


