అభివృద్ధి పనులకు భూమిపూజ
రాయచూరు రూరల్: నగరంలో అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని, మురుగు నీరు సక్రమంగా ప్రవహించేలా చూడాలని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం నగరంలోని పత్రికా భవన్ మరమ్మతు పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్‌కు రూ.10 లక్షలు నిధులు కేటాయించారు. ప్రజల సమస్యలపై స్పందించే పాత్రికేయులకు సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేశారన్నారు. రాయచూరు నగర క్షేత్ర పరిధిలోని బిజినగేర ఆంజనేయ ఆలయం రక్షణ గోడ, హైమాస్ విద్యుత్ దీపాలంకరణలకు శ్రీకారం చుట్టారు. రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడు విజయ జాగటకల్, సత్యనారాయణ, చెన్న బసవ, నగరసభ సభ్యుడు దరూరు బసవరాజ్, మురళి యాదవ్, మల్లికార్జున, దేశాయి, బాబర్, అబ్దుల్ ఖరీం, ఖాన్ సాబ్, అస్లాం పాషా, వాగేష్ పాటిల్, విశ్వనాథ, చంద్రకాంత్, భీమేష్‌లున్నారు.


