నైజీరియన్ ఇంట్లో డ్రగ్స్ డంప్
బనశంకరి: నైజీరియా డ్రగ్స్ వ్యాపారిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.5.15 కోట్ల విలువచేసే 2.5 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్, 300 ఎక్స్‌టసి మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. మంగళవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. నైజీరియా దేశానికి చెందిన ఎర్నెస్ట్ యుగాన్హ్ (45) అనే వ్యక్తి బిజినెస్ వీసాతో కొన్నేళ్ల కిందట భారతదేశానికి వచ్చాడు. బెంగళూరుకు చేరుకుని
మారతహళ్లి మున్నేకోళలులో అద్దె ఇంట్లో ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. అతని ఇంట్లో సోదాలు చేసి డ్రగ్స్‌ను సీజ్ చేసి అరెస్టు చేశారు. కాగా గతంలో ఇతనిపై నగరంలో రెండు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఇటీవల జైలునుంచి విడుదలై మళ్లీ అదే దందా చేయసాగాడు. ఇతనితో లింకులు ఉన్న ఇతర డ్రగ్స్ విక్రేతల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఏసీపీ మహానంద, సీఐ శివరాజ్ పోలీసులు పాల్గొన్నారు.
రూ.5 కోట్ల సరుకు సీజ్


