కారు బోల్తా, ముగ్గురు మృతి
● మండ్య జిల్లాలో విషాదం
మండ్య: వేగంగా వెళుతున్న కారు చిన్న వంతెనను ఢీకొని పల్టీలు కొట్టిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలో బెంగళూరు– మంగళూరు హైవేలో తిట్టనహొసహళ్లి–నాగతిహళ్ళి మధ్య జరిగింది. చిక్కమగళూరుకు చెందిన చంద్రేగౌడ (45), భార్య సరోజమ్మ (38), బంధువు సావిత్రమ్మ ఘటనాస్థలంలోనే మరణించారు. చిక్కమగళూరుకు కారులో వెళుతున్న సమయంలో అదుపుతప్పి చిన్నపాటి వంతెనను ఢీకొని ప్రమాదం జరిగింది. బిండిగనవిలె పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద దృశ్యం


