మత్తు భూతంపై కఠిన చర్యలు
ర్యాలీలో దూసుకుపోతున్న కారు
ఇప్పటికీ చెక్కు చెదరని అలనాటి కార్లు
బనశంకరి: కర్ణాటకను డ్రగ్స్ వ్యసన రహితంగా తీర్చిదిద్దే దృష్టితో మాదకద్రవ్యాల విక్రేతలు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుని తమ లక్ష్యం సాధించే వరకు విశ్రమించేదిలేదని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరు సిటీపోలీస్, చారిత్రక వాహనాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విధానసౌధ ముందు డ్రగ్స్ వ్యతిరేక వింటేజ్ కారు ర్యాలీని ప్రారంభించారు. డ్రగ్స్‌తో కర్ణాటక మాత్రమే కాదు ప్రపంచం సతమతమవుతోంది. మత్తు భూతం భవిష్యత్తును, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని చెప్పారు.
బడి పిల్లలకూ డ్రగ్స్ చాక్లెట్లు
కర్ణాటక ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ఆశయమన్నారు. గత ఏడాదినుంచి రూ.300 కోట్ల విలువచేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, వందలాదిమందిని అరెస్ట్ చేశారని మంత్రి చెప్పారు. పాఠశాలల బాలలకు కూడా డ్రగ్స్ చాక్లెట్లను అమ్ముతున్నారు, పిల్లలు వీటికి దాసోహం అవుతున్నారని వాపోయారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, టెక్కీలు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి కోరారు. ఈ సందర్భంగా కార్లు, పాతకాలం బైక్‌ల ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. డీజీపీ ఎంఏ.సలీం, పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ పాల్గొన్నారు.
హోంమంత్రి పరమేశ్వర్
ఉత్సాహంగా వింటేజ్ కార్ల జాగృతి ర్యాలీ
మత్తు భూతంపై కఠిన చర్యలు
మత్తు భూతంపై కఠిన చర్యలు
మత్తు భూతంపై కఠిన చర్యలు


