కులాంతర పెళ్లిళ్లు పెరగాలి
హుబ్లీ: ప్రతి జంట ఇద్దరు పిల్లలను తప్పకుండా కనాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. జిల్లాలోని నవళగుంద మోడల్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం జరిగిన సామూహిక వివాహ వేడుకలో సీఎం సిద్దు, డీసీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ దేశ జనాభా పెరిగి పోయిందని, చైనాను భారత్ దాటిపోయిందని చెప్పారు. కులాంతర వివాహాలు పెరగాలి. కులం, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు నిర్మూలించబడాలన్నారు. డీకే మాట్లాడుతూ కొత్త వధూవరులు ఆదర్శ దంపతులుగా సమాజంలో జీవించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపకుండా మీరే ఉద్యోగదాతలుగా ఎదిగేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 75 జంటలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలోనే నవళగుంద ఎమ్మెల్యే ఎన్‌హెచ్.కోనరెడ్డి కుమారుడు నవీన్‌కుమార్– సహన రిసెప్షన్ జరిగింది. పలువురు మంత్రులు పాల్గొన్నారు.
సీఎం సిద్దరామయ్య


