టెన్త్, పీయూసీ టైమ్ టేబుల్ విడుదల
దొడ్డబళ్లాపురం: వచ్చే ఏడాది (2026)లో జరిగే ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్), ద్వితీయ పీయూసీ , 1, 2వ పరీక్షల కాలపట్టికను కేఎస్‌ఈఏబీ ప్రకటించింది.
● ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష –1 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరుగుతాయి. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష–2 మే 18 నుంచి 25 వరకూ జరుగుతాయి.
● ద్వితీయ పీయూసీ పరీక్ష–1 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకూ జరుగుతాయి. ద్వితీయ పరీక్ష–2 ఏప్రిల్ 25 నుంచి మే 9 వరకూ నిర్వహిస్తారు.
ఎమ్మెల్యేకు తుది వీడ్కోలు
దొడ్డబళ్లాపురం: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి మంత్రి, బాగల్‌కోట కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌వై మేటి (79) అంత్యక్రియలు స్వగ్రామం తిమ్మాపురలో బుధవారంనాడు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఆయన సామాజికవర్గ సంప్రదాయం ప్రకారం సాగాయి. ఆయన భౌతికకాయంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన కుమారులు అందుకున్నారు. సీఎం సిద్దరామయ్య, మంత్రులు ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహొళి, భైరతి సురేశ్, హెచ్‌సీ మహదేవప్ప, ఎమ్మెల్సీ యతీంద్ర హాజరయ్యారు.
ఎయిర్‌పోర్టులో గంజాయి సీజ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద మొత్తం 48.5 కేజీల హైడ్రో గంజాయి దొరికింది. ఈ ప్రయాణికులు వేర్వేరు రోజులో వచ్చినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచే రావడం గమనార్హం. తరచూ గంజాయిని తీసుకువస్తూ ఉండడంతో బ్యాంకాక్ నుంచి వచ్చేవారి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.


