ధర ఇస్తారా.. తప్పుకుంటారా?
రొట్టెల సద్ది
శివాజీనగర: చెరుకు పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని, చక్కెర ఫ్యాక్టరీల నుంచి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బెళగావి జిల్లాలో రైతులు చేపట్టిన ధర్నా తీవ్ర రూపం దాల్చింది. మూడలగి తాలూకా గుల్జాపుర గ్రామంలో జరుగుతున్న నిరవధిక ధర్నా బుధవారం 7వ రోజుకు చేరుకుంది. డిమాండ్లు పరిష్కరించకపోతే కర్ణాటక బంద్ చేస్తామని రైతులు నాయకులు హెచ్చరించారు. వారం నుంచి నిరసన చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పరామర్శించలేదని ఆరోపించారు. జిల్లాలో పలు గ్రామాలు, పట్టణాలలో రైతులు రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వ విరుద్ధంగా అర్ధనగ్నంగా ధర్నాకు కూర్చొన్నారు. ఈ నెల 7న జాతీయ రహదారులను బంద్ చేస్తామని హెచ్చరించారు. రైతు నాయకుడు శశికాంత్ గురూజీ మాట్లాడుతూ పోరాటం బలంగా ఉంటే ప్రభుత్వమే దిగి వస్తుంది, ప్రభుత్వ ప్రతినిధి వస్తున్నారని తెలిసింది. ఆయనతో మాట్లాడి ఆందోళనలపై నిర్ణయం తీసుకొంటామన్నారు. సీఎం సిద్దరామయ్య చెరుకు ధర నిర్ధారించేది కేంద్ర ప్రభుత్వమన్నారు, సీఎం కుర్చీని 2 గంటలు రైతులకు ఇవ్వండి, కర్మాగారాల నుంచి బిల్లులు సాధించుకుంటాం అని సవాల్ చేశారు. ప్రతి టన్ను చెరుకుకు రూ.3,500 ధర ఇవ్వాలన్నారు.
విజయేంద్ర హాజరు
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఆందోళనలో పాల్గొన్నారు. తన పుట్టిన రోజును అక్కడే చెరుకులు, బెల్లం, దూద్‌పేడాతో జరుపుకొన్నారు. మీ సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియజేస్తానని చెప్పారు. రైతులు కోరిన ప్రకారం ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి చెరుకు రైతుల హెచ్చరిక
బెళగావిలో తగ్గని నిరసనలు
కొందరు రైతులు బెళగావి సువర్ణ విధానసౌధ ముందు వెళ్లే హైవేలో బైఠాయించడంతో వాహనాలకు ఆటంకం కలిగింది. పోరాటదారుల, పోలీసుల మధ్య వాగ్వివాదం నెలకొంది. కరవే నాయకులు కూడా పాల్గొన్నారు. టైర్లకు అగ్గిపెట్టే ప్రయత్నం చేశారు. ఇక గుల్జాపురలో రైతుల కోసం రాయభాగ తాలూకా ముగళఖోడ మహిళా రైతులు వేలాది రొట్టెల సద్దిని తీసుకొచ్చారు.
ధర ఇస్తారా.. తప్పుకుంటారా?
ధర ఇస్తారా.. తప్పుకుంటారా?


