రహస్య కెమెరా | - | Sakshi
Sakshi News home page

రహస్య కెమెరా

Nov 6 2025 8:02 AM | Updated on Nov 6 2025 8:02 AM

రహస్య

రహస్య కెమెరా

హాస్టల్‌ బాత్‌రూంలో

హోసూరు: ఆమె బుద్ధి తప్పుదోవ పట్టింది, ఇతర మహిళల వీడియోలను తీసుకుని ప్రియునికి పంపింది. ఫలితంగా రచ్చ చెలరేగింది. బెంగళూరు సమీపంలోని పారిశ్రామిక నగరం హోసూరు వద్ద అకృత్యం బయటపడింది. కంపెనీ మహిళా సిబ్బంది బస చేసే హాస్టల్‌ బాత్‌రూంలో రహస్య కెమెరాను ఏర్పాటు చేసి ఆ చిత్రాలను ఇంటర్నెట్‌లో వైరల్‌ చేశారు. ఇది తెలిసి మహిళా సిబ్బంది ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

వివరాలు ఇలా ఉన్నాయి.. హోసూరు సమీపంలోని నాగమంగలం వద్ద టాటా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ నడుస్తోంది, ఇందులో వేలాది మంది మహిళా ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వారి కోసం ఉద్దనపల్లి వద్ద ప్రత్యేక హాస్టల్‌ వసతిని కల్పించింది.

నీలాకుమారి నిర్వాకం

ఒడిశాకు చెందిన నీలా కుమారి గుప్తా (23) కూడా కంపెనీలో పనిచేస్తూ హాస్టల్లో ఉంటోంది. ఆమెకు ఏం దుర్బుద్ధి పుట్టిందో మరి ఓ బాత్‌రూంలో రహస్య కెమెరా ఉంచి తోటి మహహిళలు స్నానం చేసే దృశ్యాలను మొబైల్‌ఫోన్‌లో రికార్డు చేసుకుంది. వాటిని బెంగళూరులో ఉండే తన ఒడిశా ప్రియునికి పంపుతోంది. అతడు వాటిని ఇంటర్నెట్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలో పోస్టు చేసేవాడు. తమ చిత్రాలు నెట్‌లో వ్యాపించాయని తెలిసి మహిళలు కంగుతిన్నారు. మంగళవారం రాత్రి సుమారు రెండువేల మంది మహిళలు, యువతులు హాస్టల్‌ ముందు ధర్నాకు దిగారు. దుండగులను శిక్షించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, ఎస్పీ ఎస్పీ తంగదురై వచ్చి వారితో మాట్లాడినా శాంతించలేదు. నీలాకుమారిని అరెస్ట్‌ చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. ప్రియుని కోసం గాలిస్తున్నారు.

వైరల్‌ అయిన వీడియోలు

మహిళా ఉద్యోగిని ఘన కార్యం

వేలాది మంది మహిళల ధర్నా

హోసూరులో కలకలం

రహస్య కెమెరా1
1/1

రహస్య కెమెరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement