వరదల నివారణపై మాక్‌డ్రిల్
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో వరద పరిస్థితి నియంత్రణకు మాక్‌డ్రిల్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. బుధవారం జిలా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, హోంగార్డ్స్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలు, వరదల సమయంలో మనుషులు, జంతువులు, పశు పక్షాదులను ఎలా రక్షించాలి? అనే అంశంపై చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులకు మాక్‌డ్రిల్ నిర్వహించారు. నదులు, వాగులు, వంకల్లో వరదల్లో కొట్టుకు పోతున్న వారిని ఎలా రక్షించాలో ప్రత్యక్షంగా చేసి చూపించారు. జిల్లాలో తుంగభద్ర, కృష్ణ, భీమా నదీ తీర ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన రక్షణ కార్యక్రమాల గురించి విద్యార్థులకు తహసీల్దార్ సురేష్ వర్మ వివరించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి అఖిలేష్, ఆరోగ్య అధికారి గణేష్, బీఈఓ ఈరణ్ణ కోసిగి, రవీంద్ర భట్, ప్రజ్వల్ చేతన్, రశ్మి, శ్రీరక్ష, అనిల్ కుమార్‌లున్నారు.


